తెలంగాణ

telangana

ETV Bharat / state

తనకు నచ్చిన అమ్మాయితో చనువుగా ఉన్నాడని.. బావనే చంపేశాడు! - love crimes

తను ఇష్టపడ్డ అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని బావని హతమార్చాడో యువకుడు. ఆటోను స్టార్ట్​ చేసే తాడును మెడకు బిగించి దారుణంగా చంపేశాడు. అసలు దీనంతటికి కారణమేంటి..ప్రేమేనా..! కేసును చేధించిన పోలీసులు ఏమన్నారంటే...

తనకు నచ్చిన అమ్మాయితో చనువుగా ఉన్నాడని.. బావను చంపేశాడు!

By

Published : Aug 29, 2019, 7:58 PM IST

తనకు నచ్చిన అమ్మాయితో చనువుగా ఉన్నాడని.. బావను చంపేశాడు!
పెద్దరాజు, అర్జున్​ వరసకు బావమరుదులు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కల్లూరుపల్లిలో నివాసముంటున్నారు. ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిపై మనసు పారేసుకున్నారు. అక్క భర్త తమ్ముడైన అర్జున్..​ తను ఇష్టపడ్డ అమ్మాయితో చనువుగా ఉండటాన్ని..పెద్దరాజు జీర్ణించుకోలేకపోయాడు. అర్జున్​ గతంలో వదినను పలుమార్లు తిట్టేవాడని పోలీసులు వెల్లడించారు. అన్ని విధాలుగా కక్ష పెంచుకున్న పెద్దిరాజు...అతడిని హతమార్చాలని పథకం రచించాడు.

పక్కా వ్యూహంతో...

స్నేహితులతో కలిసి పన్నాగం పన్నిన పెద్దిరాజు..సమయం కోసం వేచి చూసాడు. వరసకు బావ అయిన అర్జున్​ను నమ్మించి మద్యం తాగుదామని ఆహ్వానించాడు. మిత్రులతో కలిసి రెండు ఆటోల్లో సమీపంలోని కావేరి ప్లాట్స్​కు వారంతా చేరుకున్నారు. ఆల్కహాల్​ సేవించిన అనంతరం ..ఆటోను స్టార్ట్​ చేయడానికి వాడే తాడును మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి అర్జున్​ను చంపేశారు. మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి.. ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసుల విచారణలో నిజాలు బట్టబయలయ్యాయి. నేరం అంగీకరించిన నిందితుడు పెద్దిరాజును..హత్యకు సహకరించిన వెంగబాబు అనే వ్యక్తిని అరెస్టు చేశామని నెల్లూరు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి...ప్రేమించాడు.. అనుమానించాడు.. కత్తితో పొడిచేశాడు!

ABOUT THE AUTHOR

...view details