ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు కోసం తన భూమిని అన్యాయంగా లాక్కుంటున్నారంటూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. హన్వాడకు చెందిన చిన్న మాసయ్య ఈరోజు అసెంబ్లీ కార్యాలయంలో రాజ్యసభ నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. ఆయన వెంట తీన్మార్ మల్లన్న కూడా ఉన్నారు.
మాసయ్యతో పాటు సుమారు 2వేల మంది దళితుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. న్యాయం కోసం నామినేషన్ వేసేందుకు సిద్ధమైన మాసయ్యకు భాజపా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దుతు ఇవ్వాలని ఆయన కోరారు.