తెలంగాణ

telangana

ETV Bharat / state

ఔటర్ రింగ్​రోడ్డు​పై తుపాకీతో కాల్చుకున్న వ్యక్తి - హైదరాబాద్​

రంగారెడ్డి జిల్లా మంచిరేపుల బాహ్యవలయ రహదారిపై యూఎస్​ కన్సల్టెన్సీకి చెందిన ఫైజాన్​​ అహ్మద్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకుని గాయపరుచుకున్నాడు. బాధితుడిని రాయదుర్గంలోని కేర్​ ఆస్పత్రికి తరలించారు.

ఔటర్ రింగ్​రోడ్డు​పై తుపాకీతో కాల్చుకున్న వ్యక్తి

By

Published : Jul 4, 2019, 5:21 PM IST

Updated : Jul 4, 2019, 6:22 PM IST

ఔటర్ రింగ్​రోడ్డు​పై తుపాకీతో కాల్చుకున్న వ్యక్తి

రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చుకున్న ఘటన కలకలం రేపింది. బాహ్య వలయ రహదారిపై టీఎస్​ 09 యూబీ 6040 సంఖ్యగల బెంజ్​ కారులో వచ్చిన ఫైజాన్​ అహ్మద్ అనే వ్యక్తి తనకు తానే తుపాకీతో కాల్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు లోయర్​ ట్యాంక్​ బండ్​ వాసిగా పోలీసులు గుర్తించారు. యూఎస్​ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హుటాహుటిన రాయదుర్గంలోని కేర్​ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్​ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.

Last Updated : Jul 4, 2019, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details