తెలంగాణ

telangana

ETV Bharat / state

బావిలో పడి వ్యక్తి మృతి.. - suspected death in Hyderabad

బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయిన ఘటన హైదరాబాద్​లోని పాతబస్తీ ఛత్రినాక పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

a man fall in well at pathabasti in Hyderabad
బావిలో పడి వ్యక్తి మృతి..

By

Published : Dec 28, 2019, 6:16 AM IST

హైదరాబాద్​ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని కందికల్​గేట్ సమీపంలోని దుర్ధన హోటల్ పక్కన ఉన్న బావిలో గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించగా వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు.

అనుమానాస్పద మృతి

పొస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 35 నుంచి 40 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బావిలో పడి వ్యక్తి మృతి..

ఇవీ చూడండి : 'ముస్లిం, మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి'

ABOUT THE AUTHOR

...view details