తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్య ఇష్టమైన కూర వండలేదని భర్త ఆత్మహత్య - man sucide for small matter in srikakulam news

భార్యాభర్తల మధ్య ఓ చిన్న తగాదాతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీ శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. తనకు ఇష్టమైన కూర వండలేదని ఆ భర్త.. భార్యతో గొడవ పడి నేలబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇష్టమైన కూర వండలేదని భార్యతో ఘర్షణ.. భర్త ఆత్మహత్య
ఇష్టమైన కూర వండలేదని భార్యతో ఘర్షణ.. భర్త ఆత్మహత్య

By

Published : Jul 16, 2020, 5:24 PM IST

భార్య తనకు ఇష్టమైన కూర వండలేదని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో జరిగింది. పట్టణంలో అన్నపూర్ణ ఆశ్రమానికి చెందిన బెల్లాల ఆంజనేయులు తనకు ఇష్టమైన కూర వండమని భార్యకు చెప్పాడు. అయితే లాక్​డౌన్​ కారణంగా దుకాణాలు తెరవనందున వండలేనని భార్య నిరాకరించింది. ఈ క్రమంలో భార్యతో గొడవపడ్డాడు. అనంతరం క్షణికావేశంలో సమీపంలోని కూరగాయల పొలంలోని నేలబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు డైలీ కలెక్షన్ ఏజెంట్​గా పని చేస్తున్నట్టు బంధువులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details