తెలంగాణ

telangana

ETV Bharat / state

కోడి పందేల్లో విషాదం.. కోడి కత్తి తగిలి ఇద్దరి మృతి - తూర్పు గోదావరి తాజా వార్తలు

cockfight
cockfight

By

Published : Jan 15, 2023, 4:19 PM IST

Updated : Jan 15, 2023, 9:57 PM IST

16:16 January 15

కోడి పందేల్లో విషాదం.. కోడి కత్తి తగిలి ఇద్దరి మృతి

Tragedy in Cock Fight: సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించిన కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది. ఏపీలోని గోదావరి జిల్లాలో కోడికత్తి తగిలి ఇద్దరు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో కోడింపందేల శిబిరం వద్ద కత్తి తగలడంతో పద్మరాజు మృతి చెందాడు. పండుగ రోజు కోడి పందేలు చూసేందుకు సరదాగా వెళ్లిన పద్మరాజుకు అకస్మాత్తుగా కోడి దూసుకురావడంతో దాని కాలుకు ఉన్న కత్తి తగిలింది. తీవ్రంగా గాయపడిన అతన్ని నల్లజర్ల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంకలో కోడికత్తి తగిలి సురేశ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కోడికి కత్తి కడుతుండగా మణికట్టుకు తగలడంతో తీవ్ర రక్త స్రావమై చనిపోయినట్టు స్థానికులు తెలిపారు. పండుగ రోజు సరదాగా కోడిపందేల శిబిరం వద్ద ఉన్నవారు చనిపోవడం ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది. పోరాట పటిమ ఉన్న ఎంత గొప్ప కోడైనా సరే ఒక్క కత్తి వేటు తగిలితే కుప్పకూలిపోతుంది. కోడిపందేల్లో గెలుపోటములను పదునైన కత్తులే నిర్ణయిస్తాయి. ఆ కత్తులే ఇద్దరి ప్రాణాలు బలిగొన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jan 15, 2023, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details