రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన ఘటన అమ్ముగూడా, అల్వాల్ బారెక్స్ రైల్వే మార్గ మధ్యలో చోటు చేసుకుంది. అల్వాల్‌కు చెందిన పొలమల్ల దేశమత్రావు రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి జేబులో దొరికిన చిరునామా ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి - railway police
ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన అమ్ముగూడా, అల్వాల్ బారెక్స్ రైల్వే మార్గ మధ్యలో చోటు చేసుకుంది. మృతుడు అల్వాల్‌కు చెందిన పొలమల్ల దేశమత్రావుగా రైల్వే పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి మృతి