కరోనా భయం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. తనకు తనకు కరోనా వైరస్ వచ్చిందేమోనన్న అనుమానంతో గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సంజీవయ్య(44) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చాడు. శుక్రవారం రాత్రి గ్రామంలోని వాలంటీర్లు హైదరాబాద్ నుంచి వచ్చిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు.
కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య
తనకు కరోనా వచ్చిందన్న అనుమానంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన వల్ల ఊరి ప్రజలకు ఈ మహమ్మారి వైరస్ సోకుతుందేమోనన్న భయంతో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
virus
ఏమైందో ఏమో సంజీవయ్య ఇవాళ ఉదయం సుమారు 7 గంటల సమయంలో తన రెండో కుమారుడు సిలువబాబుకు ఫోన్ చేశాడు. 'నాకు వ్యాధి సోకినట్లు అనుమానంగా ఉంది. నా వల్ల ఊరంతా వైరస్ వస్తుంది. నేను పోతే నాకు దూరంగా ఉండి చూడండి. ఇప్పుడు ఊరి బయట ఉన్నా'అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సిలువబాబు హుటాహుటిన బండి వేసుకుని వచ్చి చూసేసరికే, ద్వారకాపురి రోడ్ పక్కన వేప చెట్టుకు వైరుతో ఉరి వేసుకుని సంజీవయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదీ చదవండి:కరోనా అనుమానితులను వెనక్కి పంపిన వైద్యులు