తెలంగాణ

telangana

ETV Bharat / state

మేము క్షేమంగానే ఉన్నాం... ప్రేమజంట వీడియో వైరల్ - Srikalahasti latest news

Srikalahasti viral video: ఓ ప్రేమ జంట తొమ్మిది నెలల కిందట కన్పించకుండా పోయింది. వారి స్వగ్రామాలకు సమీపంలో ఇటీవల ఓ మహిళ, పురుషుడి మృతదేహాలు బయటపడ్డాయి. చనిపోయింది ఆ యువతీ యువకుడేనని వారి కుటుంబసభ్యులు భావించారు. అనుమానాలతో పోలీసులు మృతదేహాలను మార్చురీలకు తరలించారు. ఇంతలో తామిద్దరం భద్రంగా ఉన్నామంటూ ప్రేమజంట సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేయడం ఏపీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమైంది.

Srikalahasti viral video
Srikalahasti viral video

By

Published : Oct 31, 2022, 3:41 PM IST

Srikalahasti viral video: ఓ ప్రేమ జంట తొమ్మిది నెలల కిందట కన్పించకుండా పోయింది. వారి స్వగ్రామాలకు సమీపంలో ఇటీవల ఓ మహిళ, పురుషుడి మృతదేహాలు బయటపడ్డాయి. చనిపోయింది ఆ యువతీ యువకుడేనని వారి కుటుంబసభ్యులు భావించారు. అనుమానాలతో పోలీసులు మృతదేహాలను మార్చురీలకు తరలించారు. ఇంతలో తామిద్దరం భద్రంగా ఉన్నామంటూ ప్రేమజంట సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేయడం ఆంధ్రప్రదేశ్​ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమైంది.

శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన ఠాగూర్‌, లలితల కుమార్తె చంద్రిత, శ్రీకాళహస్తి మండలం రామాపురానికి చెందిన చంద్రశేఖర్‌ ప్రేమించుకున్నారు. వాలంటీరుగా పనిచేసే చంద్రశేఖర్‌ అప్పటికే వివాహితుడు కాగా, ఓ బాబు సంతానం. ఈ ఏడాది జనవరి 10న వీరు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. కేవీబీపురం మండలం కోవనూరు సమీపంలో తెలుగుగంగ కాల్వలో ఈ నెల 20న బాగా ఉబ్బినస్థితిలో గుర్తు తెలియని యువతి శవం కొట్టుకొచ్చింది. మృతదేహంపై పుట్టుమచ్చలను బట్టి చంద్రిత తల్లిదండ్రులు.. తమ కుమార్తెనేనని స్పష్టంచేశారు.

తమ బిడ్డ చావుకు కారణమైన చంద్రశేఖర్‌ను శిక్షించాలంటూ డిమాండ్‌ చేయగా.. వారికి అండగా తెదేపా, జనసేన నేతలు పోలీస్​స్టేషన్​ల వద్ద రెండు రోజులు ధర్నాలు చేశారు. ఇంతలో ఏర్పేడు మండలం అంజిమేడు సమీపంలోని బండమానుకాల్వ వద్ద ఈ నెల 22న ఓ యువకుడి మృతదేహం బయటపడింది. పోలీసులు చంద్రశేఖర్‌ కుటుంబ సభ్యులకు సమాచారమివ్వగా.. వారు చూసేందుకు రాలేదు. చంద్రిత తల్లిదండ్రులను పిలిపించగా.. ఆ మృతదేహం చంద్రశేఖర్‌ దేనని చెప్పారు.

పోలీసులు అనుమానంతో డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలంటూ రెండు మృతదేహాలను శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించి.. ఇప్పటికీ మార్చురీలోనే ఉంచారు. చంద్రిత తల్లిదండ్రులు సైతం తమకు న్యాయం జరిగే వరకూ శవాన్ని తీసుకెళ్లమని భీష్మించారు. తాజాగా ఆదివారం ‘మేం బాగున్నాం. త్వరలోనే రామాపురానికి వస్తున్నాం. మాపై వస్తున్నవన్నీ పుకార్లే. మేం సంతోషంగా ఉన్నాం’ అంటూ చంద్రశేఖర్‌, చంద్రితలు పంపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ కేసు విచారిస్తున్న పుత్తూరు గ్రామీణ సీఐ సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ అనుమానాస్పదంగా బయటపడిన రెండు శవాలపై మాకు అనుమానం ఉన్నందునే డీఎన్‌ఏ పరీక్షలకు పంపామని.. అంత్యక్రియలు చేయలేదని తెలిపారు. ఆ నివేదికలు వస్తే మృతులెవరో తేలుతుందని చెప్పారు.

ఇవీ చదవండి:Revanth Reddy on Bharat Jodo Yatra : 'రాహుల్‌తో కలిసి ఒక్క కిలోమీటరైనా నడవాలి'

రేప్ కేసుల్లో 'టూ ఫింగర్ టెస్టు'లపై సుప్రీం సీరియస్.. ఆధార్-ఓటర్ ఐడీ లింక్​పై నోటీసులు

ABOUT THE AUTHOR

...view details