Leopard Roaming in Anakapalli: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా దిబ్బపాలెంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. దిబ్బపాలేనికి చెందిన రమణ అనే రైతు తన ఆవులు, దూడలను ఊరికి సమీపంలోని పాకలో ఉంచాడు. తెల్లవారుజామున అక్కడికి వెళ్లి చూడగా ఒక దూడ చనిపోయి ఉంది. రాత్రి సమయంలో ఆ దూడపై ఏదో జంతువు దాడి చేసిందని భావించిన గ్రామస్థులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఆ జిల్లాలో చిరుతపులి సంచారం.. భయాందోళనలో జనం - AP Latest News
Leopard Roaming in Anakapalli: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున దిబ్బపాలెం గ్రామ శివారులో ఓ పశువుల పాకలో ఉన్న ఆవు దూడపై దాడి చేసింది.
అధికారులు అక్కడికి చేరుకుని అక్కడ ఉన్న పాదముద్రలను పరిశీలించి చిరుత పులిగా గుర్తించారు. చోడవరం అటవీ రేంజర్ రవి వర్మ ఆధ్వర్యంలో పులి పాదముద్రలు సేకరించి గాలింపు చర్యలు చేపట్టారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పులుల సంచారం పెరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇది వరకు కసింకోట మండలంలో పులుల సంచారం ఉండేదని.. ఆవులు, దూడలను బలి తీసుకున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఇప్పుడు దిబ్బపాలెం సమీపంలో చిరుత సంచారం వల్ల గ్రామస్థులు మరోసారి ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి: