గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ ధూల్‌పేటలోని రాణి అవంతి భాయ్ భవన్ వద్ద ఉన్న కొండలపై నుంచి ఓ పెద్ద బండ రాయి ఓ ఇంటిపై పడింది. దీంతో ఇల్లు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొంత మేర ఆస్తి నష్టం జరిగింది. స్థానిక తెరాస కార్పొరేటర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కొండ చరియలు విరిగిపడి ఇల్లు ధ్వంసం
కొండ చరియలు విరిగిపడి ఇల్లు ధ్వంసమైన ఘటన హైదరాబాద్ ధూల్‌పేటలో జరిగింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు.
కొండ చరియలు పడి ఇల్లు ధ్వంసం