రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు అరవింద్ ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నెల 24న కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేటీఆర్‌పై 108 ముఖచిత్రాలు గీసి ఔరా అనిపించారు. హైదరాబాద్‌లోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన అరవింద్... అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు.
అరవింద్‌కు చిత్రలేఖనమంటే ప్రత్యేక ఆసక్తి. ఈ క్రమంలోనే గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాపై పెన్సిల్ స్కెచ్ వేసి ప్రశంసలందుకున్న అరవింద్.. తాజాగా కేటీఆర్‌పై 108 ముఖ చిత్రాలు గీసి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో ముంబయికి చెందిన డాక్టర్ రాజేంద్ర కాంతక్ అనే చిత్రకారుడు బాల్ థ్రాకేపై 101 చిత్రాలు గీసి రికార్డు నెలకొల్పగా.. అరవింద్ కేటీఆర్‌పై 108 చిత్రాలు గీసి ఆ రికార్డును తిరగరాశారు.