తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్యను బెదిరిస్తూ సెల్ఫీ వీడియో... చివరకు దారుణం - A husband who lost his life to threaten his wife

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లాలోని తాళ్లపూడిలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించబోయి ప్రాణాలు కోల్పోయాడో వ్యక్తి.

భార్యను బెదిరిస్తూ సెల్ఫీ వీడియో...చివరకు
భార్యను బెదిరిస్తూ సెల్ఫీ వీడియో...చివరకు

By

Published : May 5, 2020, 7:22 PM IST

ఏపీలో దారుణం జరిగింది. కువైట్‌లో ఉన్న తన భార్యను స్వస్థలానికి రావాలని కోరుతున్న ఆమె భర్త ఉరేసుకుంటున్నట్లు బెదిరించబోయి చివరకు ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి ఎస్సై సతీశ్​ కథనం ప్రకారం.. తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన జి.గణేశ్​ (35) భార్య బతుకుదెరువు కోసం 5 నెలల కిందట కువైట్‌ వెళ్లింది.

ఆమెను ఇంటికి వచ్చేయమని కోరుతున్న భర్త... ఆదివారం రాత్రి ఉరేసుకుంటున్నట్లు బెదిరిద్దామని ఫ్యాన్‌కు తాడు బిగించాడు. అది ప్రమాదవశాత్తూ మెడకు బిగుసుకుపోవడంతో గణేశ్​‌ మృతి చెందాడు. ఈ ఉదంతం అంతా సెల్ఫీ వీడియోలో నిక్షిప్తం అయింది. బంధువుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

ఇవీ చూడండి:ప్రతి ఉత్పత్తిపై ఓరియంటల్ ఇన్సూరెన్స్​: నిరంజన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details