ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు పనులను 14 నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాంస్య విగ్రహం, స్మృతివనం పనులను వచ్చే నెలలో మొదలుపెట్టాలన్నారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. 2022 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహావిష్కరణతో పాటు స్మృతివనం ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. అంబేడ్కర్ స్మృతివనానికి సంబంధించిన గ్యాలరీ, ఆడిటోరియం ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అంబేడ్కర్ విగ్రహం దీర్ఘకాలం నాణ్యంగా ఉండాలని, నిర్మాణంలో మెరుపు, కళ తగ్గకుండా చూడాలని సీఎం సూచించారు.
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును 14నెలల్లో పూర్తి చేయాలి: జగన్ - విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేడ్కర్ భారీ కాంస్య విగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేడ్కర్ భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిని 14 నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. 2022 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహావిష్కరణ ఉంటుందన్నారు.
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును 14నెలల్లో పూర్తి చేయాలి: జగన్
TAGGED:
ambedkar