తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు విశాఖ పర్యటనకు కృష్ణా యాజమాన్య బోర్డు బృందం - ప్రధాన కార్యాలయం భవనాల పరిశీలనలో బోర్డు బృందం

ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాలను పరిశీలించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రతినిధుల బృందం నేటి నుంచి విశాఖలో పర్యటించనుంది. బోర్డు ప్రధాన కార్యాలయ భవనాలను తనిఖీ చేసేందుకు మూడు రోజుల పాటు వారి పర్యటన కొనసాగనుంది.

A group of Krishna river management board members visits to Visakhapatnam enquiry on buildings of main office
విశాఖ పర్యటనలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యుల బృందం

By

Published : Feb 15, 2021, 10:28 PM IST

Updated : Feb 16, 2021, 1:05 AM IST

ప్రధాన కార్యాలయ వసతిని పరిశీలించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రతినిధుల బృందం నేటి నుంచి ఏపీలోని విశాఖపట్నంలో పర్యటిస్తోంది. గతంలోనే బోర్డు తరఫున ఇంజినీర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాలను పరిశీలించారు. వాటికి సంబంధించి బోర్డుకు నివేదిక అందించారు.

తాజాగా బోర్డు సభ్యులతో కూడిన బృందం ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనుంది. బోర్డు సభ్యుడు హరికేశ్​ మీనా, సభ్య కార్యదర్శి రాయిపురే, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్ ఈ బృందంలో ఉన్నారు. కృష్ణానదీ బోర్డు ప్రధాన కార్యాలయం భవనాలను వారు పరిశీలిస్తారు. వాటిపై తుది నివేదిక రూపొందించి కేంద్ర జలవనరుల శాఖకు సమర్పించనున్నారు.

ఇదీ చూడండి :'నిధులు కేటాయిస్తే అభినందన సభ.. లేదంటే ఉద్యమ సభ'

Last Updated : Feb 16, 2021, 1:05 AM IST

ABOUT THE AUTHOR

...view details