తెలంగాణ

telangana

ETV Bharat / state

బీటెక్​ విద్యార్థుల సాయం.. నిత్యావసరాల పంపిణీ - students are distributing essentials

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతోన్న నిరుపేదలకు సాయంగా నిలిచేందుకు హైదరాబాద్​కు చెందిన ఓ 70 మంది బీటెక్ విద్యార్థులు ముందుకొచ్చారు. కష్ట కాలంలో ఆకలితో అలమటిస్తోన్న వారికి నిత్యావసరాలు పంపిణీ చేస్తూ సామాజిక బాధ్యతగా ముందుకు సాగుతున్నారు. విద్యార్థి దశ నుంచే సమాజ సేవ చేయడం తమకెంతో సంతృప్తికరంగా ఉందంటున్నారు.

distributing essentials
distributing essentials

By

Published : Jun 3, 2021, 7:23 PM IST

హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఓ 70 మంది విద్యార్ధులు 'హెచ్​హెచ్​ఎన్ ఫౌండేషన్' పేరిట ఓ బృందంగా ఏర్పాడ్డారు. లాక్​డౌన్​తో ఉపాధి కరవై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నారు. గతేడాది లాక్​డౌన్​లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి.. రెండో దశ లాక్​డౌన్​లోనూ నిరుపేదలను ఆదుకుంటున్నారు. తమకు తోచిన సాయమందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

లాక్​డౌన్​ కారణంగా రోజువారి కార్మికుల జీవనం దుర్భరంగా మారిందని ఫౌండేషన్ అధ్యక్షుడు సాయి వికాస్ అన్నారు. రెండేళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నిత్యావసరాలతో పాటు రోడ్ల పక్కన నివసించే వారికి దుప్పట్లు, ఆన్​లైన్​ తరగతులు వినలేని నిరుపేదల పిల్లలకు చరవాణులు పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచే సమాజ సేవ చేయడం తమకెంతో సంతృప్తికరంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:ఆ చిన్నారుల సంరక్షణకు కేంద్రం మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details