బడ్జెట్‌పై సాధారణ చర్చ నేడు పూర్తి కానుంది. 2020- 21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై నిన్న ఉభయసభల్లో ప్రారంభమైన చర్చ.. ఇవాళ కూడా కొనసాగనుంది. ఆ తర్వాత చర్చకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూడా సమాధానం ఇవ్వనుంది. బడ్జెట్‌పై సాధారణ చర్చ, ప్రభుత్వ సమాధానం పూర్తవుతుంది.
బడ్జెట్‌పై సాధారణ చర్చ నేటితో పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై చర్చ నేటితో ముగియనుంది. 2020- 21 ఆర్థిక సంవత్సరానికి సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇవాళ కూడా పలు అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
పల్లె ప్రగతి, ఆయిల్ ఫామ్ సాగు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ, డయాలసిస్ కేంద్రాలు, పంచాయతీలకు ట్రాక్టర్లు, విత్తనభాండాగారం, సూక్ష్మసేద్యం, కరోనా వైరస్‌కు ముందు జాగ్రత్తలు, జాతీయ ఆరోగ్య మిషన్ అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు, రోడ్డు ప్రమాదాలు, విమానాశ్రయానికి మెట్రో రైలు, ఆర్టీసీలో సరుకు రవాణా, ధాన్యం సేకరణ, రెండు పడకల గదుల ఇళ్లు, ప్రభుత్వ భూమి ఆక్రమణ అంశాలు మండలి ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి.
ఇదీ చూడండి:భాజపా రాష్ట్ర సారథిగా సంజయ్‌నే ఎందుకు నియమించారంటే?