హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ (23) స్థానికంగా మెకానిక్ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. రాత్రి మరో ముగ్గురు స్నేహితులు అక్బర్, అన్ను, సలీంలతో కలిసి మద్యం సేవించగా.. వీరి మధ్య మాట మాట పెరిగింది. హఫీజ్‌ను మిగిలిని ముగ్గురు స్నేహితులు అతి దారుణంగా బండరాళ్లతో మోది హతమార్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
'మద్యం మత్తులో స్నేహితుడినే చంపేశారు' - A friend was killed in alcohol intoxication
స్నేహితులు సరదాగా మందేశారు. మాటల్లో మునిగి తేలారు. ఈలోగా ఆ మాటలు పెరిగి పెద్దయ్యాయి. ఒకరిపై ఒకరు వాదనలకు దిగారు. ఈ గొడవ కాస్తా ముదిరి హత్యకు దారితీసింది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
!['మద్యం మత్తులో స్నేహితుడినే చంపేశారు' A friend was killed in alcohol intoxication at hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7360883-151-7360883-1590545280610.jpg)
'మద్యం మత్తులో స్నేహితుడినే చంపేశారు'
'మద్యం మత్తులో స్నేహితుడినే చంపేశారు'