తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారులతో కలిసి మిసెస్​ ఇండియాల క్యాట్​వాక్​ అదరహో.. - ఫ్యాషన్​ షో ఇన్ హైదరాబాద్

Fashion Show in hyderabad: ఆడపిల్లల సాధికారత కోసం ఓ స్వచ్ఛంద సేవాసంస్థ ఫ్యాషన్​ షో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహిళామణులు తమ క్యాట్​వాక్​తో సందడి చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులతో కలిసి మహిళలు చేసిన ఫ్యాషన్‌ షో ఆద్యంతం ఆకట్టుకుంది.

Fashion Show in hyderabad
ఫ్యాషన్ షో

By

Published : May 8, 2022, 10:07 AM IST

'ఆడ‌పిల్లల సాధికార‌త‌కు అండ‌గా నిలిచేందుకే ఫ్యాషన్ షో'

Fashion Show in hyderabad: ఆడ‌పిల్లల సాధికార‌త కోసం సేవా అనే స్వచ్చంద సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. పలువురు అందాల రాణులు చిన్నారులకు మద్దతుగా నిలిచారు. చిన్నారులతో కలిసి పలువురు మిసెస్​ ఇండియాలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌ చేస్తూ అదరహో అనిపించారు. ప్రతి అమ్మాయికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంద‌ని, నేటి ఆడపిల్లకు సాధికారత లభిస్తేనే రేపటి స‌మాజంలో వారి పాత్ర ఎంతో ఉంటుంద‌ని సేవా సంస్థ వ్యవ‌స్థాపకురాలు మమతా త్రివేది అన్నారు.

ఈ ఆలోచనతోనే బాలానగర్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను దత్తత తీసుకున్నామ‌ని సేవా సంస్థ వ్యవ‌స్థాపకురాలు మమతా త్రివేది తెలిపారు. భ్రూణహత్యలు, బాల్యవివాహాలు, పోషకాహార లోపం, అక్రమ రవాణా త‌దిత‌ర అంశాల‌పై త‌మ సంస్థ అవగాహన కల్పిస్తుందన్నారు. వీటితో పాటు మానసిక ఆరోగ్యం, పిల్లల భద్రత మొదలైన అనేక సమస్యలపై పని చేస్తోందని వివరించారు. ఈ నేప‌థ్యంలోనే ఆడ‌పిల్లల సాధికార‌త‌కు అండ‌గా నిలిచేందుకు ఈ ఫ్యాష‌న్ వాక్‌ను నిర్వహించినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details