తెలంగాణ

telangana

ETV Bharat / state

Family in shopingmall: షాపింగ్​కని వెళ్తే బిగ్​ షాక్​.. కుటుంబమంతా ఒకేసారి..! - లిఫ్ట్​లో ఇరుక్కున్న కుటుంబం

Family in shopingmall: షాపింగ్​కని వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. షాపింగ్​ సంగతి దేవుడేరుగునేమో కానీ వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. హైదరాబాద్​లో జరిగిన ఈ సంఘటన షాపింగ్​ వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

A family stuck in lift
బిగ్​ బజార్​లో లిఫ్ట్​లో ఇరుక్కున్న ఫ్యామిలీ

By

Published : Dec 25, 2021, 7:39 PM IST

Family in shopingmall: సరదాగా షాపింగ్​ చేద్దామనుకున్న ఓ కుటుంబానికి లిఫ్ట్​ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. షాపింగ్ సంగతి పక్కనబెడితే అసలు వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. ఈ సంఘటన హైదరాబాద్​లోని కాచిగూడలో ఉన్న బిగ్ బజార్​లో జరిగింది.

ఓ కుటుంబానికి లిఫ్ట్​ రూపంలో ప్రమాదం

ఏం జరిగిందంటే...

big bazaar in kachiguda: కాచిగూడలోని బిగ్ బజార్ షాపింగ్​ మాల్​ లిఫ్ట్​లో అనూహ్యంగా ఓ కుటుంబం చిక్కుకుంది. సాంకేతిక సమస్య వల్ల ముగ్గురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది ఇరుక్కుపోయారు. అయితే ఈ సంఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే బిగ్ బజార్ చేరుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు శ్రమించి 8 మందిని సురక్షితంగా రక్షించారు. సమయానికి చేరుకుని కుటుంబ సభ్యులను కాపాడినందుకు అగ్నిమాపక సిబ్బందిని నెటిజన్లు అభినందించారు.

ఓ కుటుంబానికి లిఫ్ట్​ రూపంలో ప్రమాదం

జాగ్రత్తలు తీసుకోరా..

వారు రావడం కాస్తా ఆలస్యమైనా ఎనిమిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని షాపింగ్​కు వచ్చిన పలువురు అంటున్నారు. నగరంలోని ఇలాంటి పెద్ద షాపింగ్​ మాల్స్​లో కనీస జాగ్రత్తలు పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వినియోగదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో షాపింగ్​ మాల్స్​ నిర్వాహకుల డొల్లతనం బయటపడింది.

ABOUT THE AUTHOR

...view details