హైదరాబాద్ ఎల్బీనగర్లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం వీధి కుక్క పసికందును నోట కరచుకుని వెళ్లింది. మృత శిశువును కరుచుకొని వెళ్తుండగా.. గమనించిన యువకులు వెంబడించారు. భయపడిన కుక్క.. శిశువును వదిలేసి పారిపోయింది.
హృదయ విదారకం: వీధికుక్క నోట మృత పసికందు - A dog killed small baby latest news
కన్నపేగు మీద కనీస మమకారం లేని ఓ తల్లి.. అప్పుడే పుట్టిన ఒక శిశువును నడి వీధిలో వదిలేసి పోయింది. తల్లి కర్కష హృదయానికి ఆ శిశువు కుక్కల చేతిలో చిధ్రమైపోయింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్లో శుక్రవారం చోటు చేసుకుంది.
హృదయ విదారకం: వీధికుక్క నోట మృత పసికందు
అనంతరం స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి:'యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించండి'