తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్మశానానికి ఒక మృతదేహం బదులు మరొకటి... - బేగంపేట \

గాంధీ ఆసుపత్రిలో బేగంపేట ప్రాంతానికి చెందిన కరోనా బాధితుడి మృతదేహానికి బదులు మరో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. అంత్యక్రియల సమయంలో మృతదేహం తమకు సంబంధించింది కాదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

స్మశానికి ఒక మృతదేహం బదులు మరోటి తరలింపు
స్మశానికి ఒక మృతదేహం బదులు మరోటి తరలింపు

By

Published : Jun 10, 2020, 6:52 AM IST

Updated : Jun 10, 2020, 8:18 AM IST

సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ ఆసుపత్రిలో బేగంపేట గురుమూర్తి నగర్​కు చెందిన వ్యక్తి ​ కరోనా కారణంగా మృతి చెందాడు. అంత్యక్రియల నిమిత్తం బేగంపేటకు చెందిన వ్యక్తి మృతదేహానికి బదులుగా.. మరో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. ఫలితంగా కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యులపై దాడికి దిగారు. ఘటనతో గాంధీ వైద్యులు ఒక్కసారిగా ఆసుపత్రి బయటకు వచ్చి తమపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ధర్నాకు దిగారు. గాంధీ ఆసుపత్రి ఎదుట పీజీ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు.

కుటుంబీకులు గుర్తించడం వల్లే..

కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి చూసి తమకు సంబంధించిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. వెంటనే సదరు వ్యక్తి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి బేగంపేటకు సంబంధించిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తాము కుటుంబ సభ్యులకు చూపించినట్లు వైద్యులు పోలీసులకు వివరించారు.

ఇవీ చూడండి : 'అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం.. సిటీ బస్సులకు నో'

Last Updated : Jun 10, 2020, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details