తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా లీలలు: పైసల కోసం బతికున్న మనిషిని చంపేశారు!

కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరితే బిల్లు పేరుతో వేధిస్తున్నారనే వార్తలు హల్​చల్ చేస్తున్నాయి. ఈ సమయంలోనే మరో వార్త తెరమీదకొచ్చింది. పైసల కోసం ఏకంగా బతికున్న వ్యక్తినే చనిపోయాడని చెప్పారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అదంతా అబద్దమని యశోద యాజమాన్యం చెబుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే...

a corporate hospital gave wrong information about corona patient
కరోనా లీలలు: బతికున్న వ్యక్తిని చనిపోయాడని చెప్పారు

By

Published : Jul 9, 2020, 6:19 PM IST

Updated : Jul 9, 2020, 7:41 PM IST

అంబర్​పేటకు చెందిన భాజపా నేత కుమారుడు నరసింగరావు అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్ష చేయిస్తే కొవిడ్​ అని తేలింది. పదిరోజుల క్రితం సికింద్రాబాద్​లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇప్పటివరకూ సుమారు రూ.8 లక్షలు చెల్లించారు. బుధవారం ఆసుపత్రి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. నరసింగరావు చనిపోయారని చెప్పారు. మరో రూ.5 లక్షలు చెల్లించి డెడ్​బాడీని తీసుకెళ్లాలని సూచించారు.

కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఓ వైపు డబ్బులు సిద్ధం చేస్తూనే.. దహన సంస్కారాలని ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులు, శ్రేయోభిలాషులకు దుర్వార్తను చేరవేశారు.

కుటుంబ సభ్యులకు సందేహం కలిగి మరోసారి ఆసుపత్రిలో విచారించగా అదంతా అబద్దమని తేలింది. నరసింగరావు బతికే ఉన్నారని తెలిసింది. వీడియో కాల్​లో ఆయన్ని చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కంగుతిన్న కుటుంబ సభ్యులు సంతోషంతో కన్నీరు కార్చారు. డబ్బుల కోసం ఇంతకు దిగజారిన యశోద యాజమాన్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతా అబద్దం...

ఈ ఘటనపై యశోద యాజమాన్యం మాత్రం మరోలా స్పందించింది. తమ ఆసుపత్రిలో నర్సింగ్ అనే వ్యక్తి చనిపోయాడని ఎవరికీ చెప్పలేదని పేర్కొంది. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. చనిపోయాడని చెబితే, వీడియో కాల్ చేసి ఎందుకు చూపిస్తామని యశోద ఆసుపత్రి పీఆర్​ఓ సంపత్ ప్రశ్నించారు.

కరోనా లీలలు: బతికున్న వ్యక్తిని చనిపోయాడని చెప్పారు

ఇదీ చదవండి :ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

Last Updated : Jul 9, 2020, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details