తెలంగాణ

telangana

ETV Bharat / state

SONG ON POLICE: 'రక్షించే రక్షక భటుడు.. సమాజ క్షేమమే ధ్యేయంగా' - constable song on police

ఆపదలో ఉన్నప్పుడు పిలిస్తే దేవుడు వస్తాడో రాడో తెలియదు కానీ.. పిలిచిన వెంటనే వచ్చి నిన్ను రక్షించేవాడే పోలీసు. సాంకేతికను వినియోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​తో వారికి మరింత చేరువయ్యారు. కానీ కొందరికి పోలీసు శాఖపై ఉన్న అపోహలు, అపనమ్మకం మాత్రం పోవడం లేదు. వారితో స్నేహ భావం కంటే పోలీసులను చూసి భయపడే వారే ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ప్రజల కోసం పోలీసులు చేస్తున్న సాహసాలు, సేవా కార్యక్రమాలు, వారి నిబద్ధతను తెలియజేస్తూ పాట రూపంలో మనకు అందించారు హైదరాబాద్​ కమిషనరేట్​లో పనిచేస్తున్న ఏఆర్​ కానిస్టేబుల్​ వంశీకృష్ణ.

constable song
కానిస్టేబుల్​ పాట

By

Published : Aug 16, 2021, 4:28 PM IST

పోలీసు శాఖపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని తొలగించడేమే లక్ష్యంగా ఓ కానిస్టేబుల్ తనవంతు కృషి చేస్తున్నారు. పోలీసులు చేస్తున్న కృషిపై పాటల రూపంలో ప్రచారం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​కి చెందిన అన్నం వంశీకృష్ణ.. హైదరాబాద్ కమిషనరేట్​లో ఏఆర్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్నారు. పీజీ పూర్తి చేసిన వంశీకృష్ణ.. ఉద్యోగంలో చేరకముందు తనకు పాటలపై ఉన్న అభిరుచి కారణంగా స్నేహితులతో కలిసి సినిమా పాటలు పాడేవారు. మరికొన్ని పాటలు తానే స్వయంగా రాసుకుని ఆలపించేవారు.

2020లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన వంశీకృష్ణ.. పోలీసులపై కొందరికి ఉన్న అపనమ్మకాన్ని పూర్తిగా తొలగించాలని అనుకున్నారు. అందుకు పాట రూపంలో చెబితే వింటారని భావించారు. దానికోసం బాలీవుడ్​లో అక్షయ్ కుమార్ నటించిన కేసరి సినిమాలోని 'తేరి మిట్టి హే మిలుజావా..' అనే పాటను ఎంచుకున్నారు. ఆ పాటకు ఉన్న బాణీలను వాడుకుని సొంతంగా..ఓ ధీరుడిలా... అంటూ తెలుగులో పోలీసులు చేస్తున్న సేవలను తెలియజేస్తూ పాటను రాశారు.

కానిస్టేబుల్​ వంశీకృష్ణ ఆలపిస్తున్న పాట

ఎస్​ఆర్​నగర్​లోని తన స్నేహితుడి ధ్వని స్టూడియోస్ సహకారంతో పాటను వంశీకృష్ణ స్వయంగా పాడి య్యూట్యూబ్​లో పెట్టారు. ఇప్పుడు ఈ పాట వైరల్​గా మారింది. అంతే కాదు వంశీకృష్ణను ఉన్నతాధికారులు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ పాటను మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి:Vote For Note Case: ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టుకు ఎమ్మెల్యే సండ్ర

ABOUT THE AUTHOR

...view details