హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బహదూర్‌పురాలో గణేశ్ విగ్రహాన్ని క్రేన్‌తో లారీలో పెడుతుండగా కానిస్టేబుల్ రవీందర్ జారిపడ్డాడు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఆయన బహదూర్‌పుర పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గణేశ్ నిమజ్జనంలో భాగంగా కిషన్‌బాగ్‌లోని గణేశ్ మండపం వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. బాధితుడు గత కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. కిడ్నిలో రాళ్లు ఉండడంతో చికిత్సకు సెలవుల కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ అధికారులు మంజూరు చేయలేదని... పని ఒత్తిడి కారణంగానే రవీందర్ అనారోగ్యానికి గురయ్యాడని ఆరోపించారు.
నిమజ్జనంలో అపశ్రుతి.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం - hyderabad ganesh immersion
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బహదూర్‌పురాలో ఓ కానిస్టేబుల్ క్రేన్ నుంచి జారిపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉంది.
canistable