బార్ కౌన్సిల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు అడ్వకేట్స్ మ్యూచువల్ ఎయిడిడ్ కోపరేటివ్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి, సీనియర్ న్యాయవాది శంకర్. న్యాయవాదుల నుంచి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆఫ్ పార్టీస్ , వెల్ఫేర్ టికెట్, గ్యాప్ పిరియడ్ అమౌంట్ తదితర సేవల పేరుతో వసూలు చేస్తున్న నిధులు బార్ కౌన్సిల్ ఖాతాలో జమ కావడం లేదని ఆరోపించారు. వార్షిక ఆదాయ, వ్యయాల నివేదికలో కూడా పొందుపర్చలేదని వివరించారు. ప్రభుత్వం తక్షణమే బార్ కౌన్సిల్ అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బార్ కౌన్సిల్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలి - తెలంగాణ బార్ కౌన్సిల్
తెలంగాణ బార్ కౌన్సిల్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని అడ్వకేట్స్ మ్యూచువల్ ఎయిడిడ్ కోపరేటివ్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి, సీనియర్ న్యాయవాది శంకర్ కోరారు. కౌన్సిల్ బ్యాంకు ఖాతాలో జమకాని కోట్లాది రూపాయలు గోల్ మాల్ అయ్యాయని పేర్కొన్నారు.
తెలంగాణ బార్ కౌన్సిల్