హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ మారింది. చూసిన ప్రతి ఒక్కరిని కలచివేసింది. చెత్తను సేకరించే బండిలో అభంశుభం తెలియని చిన్నారులు ప్రయాణిస్తుంటే చలించిన ఓ యువకుడు వెంటనే తన ఫోన్‌లో ఆ దృశ్యాన్ని బంధించాడు.
viral video: నగరాన్ని ఇలా శుభ్రం చేస్తున్నారా..? దయచేసి.. - hyderabad district news
భాగ్యనగరం నడి బొడ్డున కనిపించిన ఓ దృశ్యం ఓ వ్యక్తిని కలిచివేసింది. వెంటనే ఆ దృశ్యాన్ని తన ఫోన్‌లో బంధించి... నగరాన్ని ఇలా శుభ్రం చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్టర్‌లో షేర్ చేశాడు. ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఎల్బీ నగర్ ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్తున్న జీహెచ్ఎంసీ చెత్త సేకరించే వాహనంలో ఇద్దరు చిన్నారులు కనిపించారు. ఆ చెత్త వాహనాన్ని నిర్వహించే దంపతులు వారి పిల్లలను వెనకాల గార్బేజ్ బిన్స్‌లో ఎక్కించారు. అటుగా వెళ్తున్న ఆ యువకుడు ఆ దృశ్యం చూసి చలించి పోయాడు. నగరాన్ని ఇలా శుభ్రం చేస్తున్నారా? దయచేసి ఇలా చేయకండని కోరుతూ వీడియోను షేర్ చేశాడు. తెలంగాణ సీఎంవో, మంత్రి కేటీఆర్ ఆఫీస్, తెలంగాణ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. స్పందించిన తెలంగాణ పోలీసులు దీనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:పసికందుపై అత్యాచారం.. ఆపై కిరాతకంగా...