Ktr Respond on A child's tweet: మంత్రి కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఏదైనా సమస్య అంటే... వెంటనే స్పందిస్తారు. అంతే కాదు ఎంత బిజీగా ఉన్నా... ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా... సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. కష్టాల్లో ఉన్నాను అంటూ ఎవరైనా ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేసినా... వెంటనే వారికి తక్షణ సాయం అందిస్తారు. అయితే తాజాగా ఓ చిన్నోడు చేసిన పనికి మంత్రి కేటీఆర్ స్పందించాడు. వెంటనే అధికార యంత్రాంగం మొత్తం ఆ బుడ్డొడి ట్వీట్‌కు కదిలివచ్చింది. అసలు ఏం జరిగిందంటే...
హైదరాబాద్‌లోని గోల్డెన్ సిటీ కాలనికి గత 5 ఏళ్లుగా తాగునీరు అందడం లేదు. దీనితో అక్కడి వాసులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే దీనిపై ఓ చిన్నోడు వీడియో తీసి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. ఆ వీడియోలో బాలల దినోత్సవం రోజు కేటీఆర్ అంకుల్‌కు విజ్ఞప్తి అంటూ... ఓ బోర్డ్ పట్టుకుని నిలబడ్డాడు ఉమర్. ''మా కాలనీకి 5 ఏళ్లుగా నీళ్లు అందడం లేదంటూ.. అందులో రాసి ఉంది. మేం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం... ప్లీజ్ అంకుల్ సాయం చేయండి.. అంటూ.. ఆ చిన్నోడు కేటీఆర్‌ను కోరాడు.