తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు హై ప్రోటీన్ ఫుడ్​, ఓఆర్ఎస్​ల పంపిణీ - food distributtion To the police

కొవిడ్ సంక్షోభంలో.. విధి నిర్వాహణలో అహర్నిశలు కృషి చేస్తోన్న పోలీసు​ సిబ్బందికి పలువురు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్ నగరంలో లాక్​డౌన్​ విధుల్లో ఉన్న పోలీసులకు.. ఆహారం అందజేసి మానవత్వాన్ని చాటుకుందో ఓ స్వచ్ఛంద సంస్థ.

food distribution to police
food distribution to police

By

Published : May 23, 2021, 4:45 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో పలువురు దాతలు వివిధ రూపాల్లో సహాయం అందిస్తూ.. తమ దాతృత్వం చాటుకుంటున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన మైనంపల్లి సోషల్ సర్వీస్ అనే సంస్థ.. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తోన్న 800 మంది సిబ్బందికి హై ప్రోటీన్ ఫుడ్​, ఓఆర్ఎస్​లను అందించింది.

కరోనా విజృంభణ, అధిక ఉష్ణోగ్రతలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా అహర్నిశలు పాటు పడుతోన్న పోలీసు సిబ్బందికి ప్రజలంతా సహకరించాలని సంస్థ ప్రతినిధులు కోరారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. సడలింపు సమయంలో గుమిగూడకుండా.. భౌతిక దూరం వంటి నియమాలను పాటించాలని కోరారు. సంస్థ ఆధ్వర్యంలో.. లాక్​డౌన్​లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:'ఆనందయ్య మందుకు అనుమతి వస్తే.. తయారీకి సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details