హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేదలకు ఆదుకునేందుకు ఆక్టోపస్ స్వచ్చంద సంస్థ ముందుకొచ్చింది. బంజారాహిల్స్‌లోని బోలానగర్, ఖాజానగర్‌లో కూలీలు, నిరుపేదలకు స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు.
300 మందికి సాయం చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ
లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కార్మిక కుటుంబాలకు దాతలు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని బోలానగర్, ఖాజానగర్ కాలనీల్లో ఆక్టోపస్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 300 మందికి నిత్యావసరాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మీ హాజరయ్యారు.
300 మందికి సాయం చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ
సుమారు 300 మంది పేదలకు బియ్యం, పప్పులు, నూనెతోపాటు ఇతర సరకులు అందించారు. మరో 10 రోజుల పాటు నిరుపేదలకు సరకులు అందించనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ అనిరుద్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్టోపస్ సంస్థ ముందుకొచ్చి పేదలకు ఆదుకోవడం సంతోషకరమని కార్పొరేటర్ అన్నారు. అందరూ భౌతిక దూరం పాటించి కరోనాను దూరం చేయాలని సూచించారు.
ఇదీ చూడండి :వందేళ్ల ప్రస్థానం గల బొగ్గు గని మూసివేత