పంటల్ని నాశనం చేస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అడవి పందుల సమస్యకు పరిష్కారం లభించే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం వన్యప్రాణిగా ఉండటంతో అడవి పందులకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షణ ఉంది. వీటిని వన్యప్రాణి జాబితా నుంచి తొలగించి కీటకజీవి (వర్మిన్)గా ప్రకటించాలన్న అన్నదాతల విజ్ఞప్తుల్ని రాష్ట్ర ప్రభుత్వవర్గాలు సానుకూలంగా పరిశీలిస్తున్నాయి.
అడవిపందిని కీటకజీవిగా ప్రకటించే అవకాశం! - హైదరాబాద్ వార్తలు
అడవిపందిని కీటకజీవిగా ప్రకటించే అవకాశం ఉంది. రైతులు తమ పంటల్ని నాశనం చేస్తున్న అడవి పందులను కీటకజీవులుగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నదాతల విజ్ఞప్తుల్ని రాష్ట్ర ప్రభుత్వవర్గాలు సానుకూలంగా పరిశీలిస్తున్నాయి.
అడవిపందిని కీటకజీవిగా ప్రకటించే అవకాశం!
అడవిపందిని కీటకజీవిగా ప్రకటించే అంశం కేంద్ర అటవీ, పర్యావరణశాఖ పరిధిలో ఉంది. రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి వస్తే ఆ మేరకు ప్రభావిత ప్రాంతాల్లో అడవిపందిని కీటక జీవిగా కేంద్రం ప్రకటిస్తుంది. ఇలా ప్రకటిస్తే.. ఆయా మండలాల్లో తమ పంటల్ని రక్షించుకునేందుకు రైతులకూ వాటిని చంపే వెసులుబాటు వస్తుంది.
ఇదీ చదవండి:అడవుల్లో పేలిన తూటా... ముగ్గురు మావోయిస్టులు మృతి