Case Filed Against YS Sharmila : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ప్రెస్ మీట్, సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీని దూషిస్తూ మాట్లాడారని ఆ పార్టీ నేత నరేందర్ యాదవ్ ఈ నెల 16వ తేదీన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Case Against Sharmila in Banjarahills Police station : బీఆర్ఎస్ పార్టీని బందిపోట్ల రాష్ట్ర సమితి అని ప్రస్తావించడంతో పాటు కేసీఆర్ పేరుపై అఫిడవిట్ తయారు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నరేందర్ యాదవ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గతంలో వైఎస్ షర్మిల ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెపై సెక్షన్ 353, 332, 509, 427 కింద కేసు నమోదు చేశారు. వాటితో పాటుగా రెడ్‌విత్ 34, 337, మరో రెండు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. పోలీసులపై చేయి చేసుకున్నారనే కేసులో అరెస్టయిన షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో షర్మిలకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.