case registered against dsp సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు చేసిన ఫిర్యాదుపై... సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. ఓ పారి అనే ప్రేవేట్ ఆల్బమ్‌లో "హరే రామ - హరే కృష్ణ" మంత్రంపై అశ్లీల నృత్యాలు చేశారని ఫిర్యాదు చేసిన హిందు సంఘాలు, కరాటే కల్యాణి... రెండు రోజుల క్రితం చేసినట్లు పేర్కొన్నారు. హిందుల మనోభావాలను దేవిశ్రీ ప్రసాద్ దెబ్బతీయడానికి యత్నిస్తున్నారని ఫిర్యాదులో కరాటే కల్యాణి పేర్కొన్నారు. న్యాయ సలహాలు తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు - మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ ఓ పరి సాంగ్ ఇష్యూ
case registered against dsp సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు అయింది. కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని దేవిశ్రీప్రసాద్‌పై ఫిర్యాదు అందడంతో... ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
![మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు A case has been registered against music director Devisree Prasad about a pari song issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16814057-354-16814057-1667388802185.jpg)
అయితే దేవీ శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో ఒకరు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. టాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు దేవీ. ఈ రాక్ స్టార్ కంపోజ్ చేసిన నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియో ఓ పరి సాంగ్. ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయడమే కాకుండా స్వయంగా పాడాడు. పాన్ ఇండియా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా పాట కంపోజ్ చేశాడు. అయితే ఈ పాటలోహరేరామ హరేకృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్‌గా మార్చారని కరాటే కల్యాణి, హిందూ సంఘాలు మండిపడ్డాయి.
ఇవీ చూడండి: