2018 సాధారణ ఎన్నికల సమయంలో తెలంగాణ శాసనసభ ఉపసభాపతి తీగుల్ల పద్మారావుగౌడ్పై నమోదైన కేసును న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అడ్డగుట్ట ప్రాంతంలో అనుమతి లేని కరపత్రాలను పంపిణీ చేశారంటూ ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేశారు.
ఉపసభాపతిపై నమోదైన కేసు కొట్టివేత - తెలంగాణ శాసనసభ ఉపసభాపతి శ్రీ తీగుల్ల పద్మారావుగౌడ్
తెలంగాణ శాసనసభ ఉపసభాపతి తీగుల్ల పద్మారావుగౌడ్పై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 2018 సార్వత్రిక ఎన్నికల్లో అనుమతి లేని కరపత్రాలను పంపిణీ చేశారంటూ ఆయనతో సహా మరో నలుగురిపై తుకారంగేట్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
ఉపసభాపతిపై నమోదైన కేసు కొట్టివేత
దీంతో ఆయనతో పాటు మరో నలుగురిపై తుకారంగేట్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ప్రత్యేక న్యాయస్థానంలో వారిపై నేర అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసును విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం ఉపసభాపతితో పాటు మరో నలుగురిపై కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.