నిలిపిఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైన ఘటన హైదరాబాద్లోని సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అంజలి థియేటర్ సమీపంలో చెత్త కుప్ప వద్ద అకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
నడిరోడ్డుపై దగ్ధమైన కారు.. ఎగిసిపడిన మంటలు - Hyderabad latest news
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారులో మంటలు చెలరేగాయి. అంజలి థియేటర్ సమీపంలో చెత్త కుప్ప వద్ద అకస్మాత్తుగా కారు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఆగి ఉన్న కారులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
చెత్తకుప్ప వద్ద మంటలు చెలరేగి కారుకు అంటుకున్నాయి. ఒక్కసారిగా పెద్ద మంటలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చూడండి:మహాశివరాత్రి: హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు