హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం ఐదో అంతస్తు నుంచి దూకి మోహన్ అనే వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇవాళ ఉదయం పటాన్చెరు మండలం కర్దనూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. మరొకరు గాయపడ్డారు. తన కారు ఢీ కొట్టినందుకే ఈ ప్రమాదం జరిగిందన్న భావనతో మోహన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కూకట్పల్లిలో భవనంపై నుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య - businessman mohan
కూకట్పల్లిలో దారుణం జరిగింది. ఓ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కారు ఢీకొని ఓ వ్యక్తి చనిపోవడం వల్ల భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
కూకట్పల్లిలో భవనంపై నుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య
ఇవాళ ఉదయం...
స్నేహితులతో కలిసి వ్యాపారి మోహన్ పటాన్చెరులోని గుడికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో వాహనం నడిపి ఒకరి ఉసురు తీశాడు. ప్రమాదానంతరం కారును అక్కడే వదిలేసి కూకట్పల్లికి వచ్చిన మోహన్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. అపరాధ భావంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.