హైదరాబాద్ మహానగరంలో ప్రతి యేటా గణేశ్ నిమజ్జనోత్సవంలో సందడి వాతావరణం నెలకొంటుంది. నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు నగరం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. దీంతో రహదారిపై ఓ వైపు వినాయకుడి విగ్రహాలు, మరో వైపు వాహనాల రద్దీనే కాకుండా భక్తుల కోలాహలం. వీటన్నింటి నడుమ ఆ నిమజ్జనాన్ని చూసి తిరుగు ప్రయాణమయ్యేసరికి ఎంత సమయం అవుతుందో చెప్పలేం. ఆ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతో మంది స్వచ్ఛందంగా వారి దాహార్తి తీరుస్తుంటారు. మరికొందరు ప్రసాదాన్ని పంచుతుంటారు. ఈ క్రమంలోనే ఓ వ్యాపార వేత్త పదకొండేళ్లుగా నిమజ్జనోత్సవంలో అన్నదాన(ANNADANAM) కార్యక్రమం చేపడుతున్నారు.
గణేశ్ నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఆకలి ఓ వ్యాపారవేత్త. పాతబస్తీకి చెందిన వ్యాపారి శ్రీధర్.. గత 11ఏళ్లుగా బషీర్ బాగ్ నిజాం కళాశాల పక్కన అన్నదానం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలివస్తుంటారు. క్యూలో నిలబడి అన్నదానం స్వీకరిస్తున్నారు. 50మంది పనిమనుషులతో శ్రీధర్ అక్కడే వంటలు చేయించి... అక్కడికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెడుతున్నారు.