అసలే అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే... అక్కడి మంచం విరిగి రోగి నడుము విరగ్గొట్టుకున్న ఘటన.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. హిందూపురంలోని అహ్మద్‌నగర్‌కు చెందిన అల్తాఫ్ అనే బాలుడికి జ్వరం రావడంతో తల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత చిన్నపిల్లల వార్డులో మంచం కేటాయించి చికిత్స అందిస్తున్నారు.
బాలుడు, అతడి తల్లి ఆ మంచంపై ఉండగా.. ఒక్కసారిగా అది విరిగి ఒక పక్కకు పడిపోయింది. దీంతో జ్వరంతో బాధపడుతున్న కుమారుడితో పాటు.. అతడి తల్లికి గాయాలయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బాధితులు వాపోయారు.