చంద్రకళా... డెంగీ ఎంత పని చేసిందమ్మా..?! - a bride died due to dengue in Chittur district of andhrapradesh
పెళ్లికూతురుగా ముస్తాబైన యువతిని.. విష జ్వరం కబళించింది. డెంగీ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు.. పెళ్లింట చావు బాజా మోగేలా చేసింది. అక్టోబరు 30న పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకుని.. పనులన్నీ పూర్తైన దశలో.. ఆ యువతి జీవితం అర్థాంతరంగా ముగిసింది.
![చంద్రకళా... డెంగీ ఎంత పని చేసిందమ్మా..?!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4936698-268-4936698-1572669182473.jpg)
చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం నరసింహాపురం గ్రామంలో.. విష జ్వరం తీరని విషాదం నింపింది. కృష్ణమరాజు, రెడ్డమ్మ దంపతులు తమ కుమార్తె చంద్రకళకు గత నెల 30 పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలో.. చంద్రకళకు డెంగీ సోకింది. పరిస్థితి విషమించింది. తమిళనాడులోని వేలూరు ఆస్పత్రిలో చేర్పించగా.. రెండు రోజుల పాటు జ్వరంతో చంద్రకళ పోరాడింది. ఇంతలో పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. బంధుమిత్రులు, గ్రామస్తులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. కానీ.. ఆస్పత్రి నుంచి చంద్రకళను పంపేందుకు వైద్యులు నిరాకరించారు. పెళ్లి చేసేందుకు ప్రయత్నించిన పెద్దలతో.. 'మీ ఇష్టం' అని వైద్యులు తేల్చి చెప్పారు. అప్పటికే తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడిన చంద్రకళ ఆరోగ్యం.. ఆ తర్వాత మరింత దిగజారింది. పరిస్థితి చేయిదాటి.. ఆమె కన్నుమూసింది. పచ్చని పారాణితో పెళ్లి పీటలు ఎక్కాల్సిన చంద్రకళ.. ఇలా అర్థంతరంగా తనువు చాలించడం బాధిత కుటుంబాలను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
TAGGED:
bride due to dengue