ఆడుకోవడానికి ట్యాబ్ ఇవ్వలేదని మనస్తాపానికి గురైన సత్య ప్రసాద్ (12) అనే బాలుడు బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు. నగరంలోని మియాపూర్ లో ఈ ఘటన జరిగింది. మియాపూర్ పీఎస్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లో ఉంటున్న శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు బాల వెంకట సత్య ప్రసాద్ ట్యాబ్ తో ఆడుకుంటుండగా పెద్దబ్బాయి నందకిషోర్ ట్యాబ్ కావాలని అడిగాడు. తండ్రి పెద్ద కుమారునికి ట్యాబ్‌ను ఇచ్చాడు.
'ట్యాబ్ కోసం అన్నదమ్ముల మధ్య గొడవ... ఒకరు మృతి' - Tab controversy Miyapur Boy death
హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం నెలకొంది. ట్యాబ్ కోసం అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి... ఓ పన్నెండేళ్ల బాలుడు బిల్డింగ్ మీద నుంచి దూకి మరణించాడు.
!['ట్యాబ్ కోసం అన్నదమ్ముల మధ్య గొడవ... ఒకరు మృతి' Boy Death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6251063-659-6251063-1582992888894.jpg)
Boy Death
దీంతో మనస్తాపానికి గురైన సత్య ప్రసాద్ ఆ భవనం మీద నుంచి కిందకు దూకి మరణించాడు. అప్పటిదాకా కళ్లముందే ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడటం వల్ల తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. మృతుడు సత్య ప్రసాద్ కొండాపూర్‌లోని ఓ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.
'ట్యాబ్ కోసం అన్నదమ్ముల గొడవ... ఒకరు మృతి'
ఇదీ చూడండి : బాలికలతో వెట్టిచాకిరి చేయిస్తోన్న టీవీ యాంకర్