పిల్లలు ఆర్థికంగా స్థిరపడి... ఎటువంటి కష్టాలు లేకుండా... జీవిత చరమాంకంలో రోజులు హాయిగా గడిచిపోతే చాలు ఎవరు ఏలా ఉంటే మనకెందుకులే అనుకుంటారు చాలా మంది... కానీ ఓ వృద్ధురాలు అలా ఆలోచించలేదు. కమ్మేస్తున్న కరోనాలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి చలించిపోయింది. ప్రత్యక్షంగా తాను వారికి ఏమీ చేయలేకపోతున్నానని బాధపడింది. తాను చేయగలిగింది కేవలం ఆర్థిక సహాయమే అని భావించి లక్షరూపాయల చెక్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందించించి కూకట్పల్లి వసంతనగర్కు చెందిన తొంబైఏళ్ల వృద్ధురాలు రాజమణి.
బామ్మ మనసు బంగారం.. లక్ష రూపాయల విరాళం - hyderabad latest news
ఖర్చులు పోయి కాసిని డబ్బులుంటే బ్యాంకులో వేసుకుందామా... వస్తువులు కొనుక్కుందామా... స్థిరాస్తులు కూడబెట్టుకూడబెడదామా.. అని ఆలోచిస్తారు కొందరు. కానీ కష్టకాలంలో కొంతైనా పొరుగువారికి సాయం చేద్దాం అనుకుంటారు ఇంకొందరు. సాయం చేయాలనే మనసుండాలే కాని వయసుతో పనేముంది. కరోనా విపత్కర పరిస్థితిలో ఇబ్బందిపడుతున్న ప్రజలకు తనవంతు సాయం చేయాలని తపించిన ఓ 90 ఏళ్ల వృద్ధురాలు ముఖ్యమంత్రి సహాయనిధికి లక్షరూపాయలు విరాళం అందించి తన పెద్దమనసును చాటుకుంది.
![బామ్మ మనసు బంగారం.. లక్ష రూపాయల విరాళం old women donate to 1lakh rupees cheque for cm relief fund](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7276632-thumbnail-3x2-help-rk.jpg)
సీఎం సహాయనిధికి లక్షరూపాయలు విరాళమిచ్చిన వృద్ధురాలు
కరోనా నిర్మూలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి అందరూ తమ వంతుగా చేయూతనివ్వడం గొప్పవిషయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కష్టకాలంలో పెద్దమనసుతో ముఖ్యమంత్రి సహాయనిధికి లక్షరూపాయలు విరాళం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కష్టకాలంలో తన వంతు సాయం చేసిన రాజమణి గురించి తెలిసిన వారెవరైనా బామ్మ మనసు బంగారం అని కొనియాడుతున్నారు.
బామ్మ మనసు బంగారం.. లక్ష రూపాయల విరాళం
ఇదీ చూడండి:ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌కు కీలక పదవి
Last Updated : May 20, 2020, 6:06 PM IST