ఈ ఏడాది ఖైరతాబాద్‌లో మట్టి వినాయకుడి ఏర్పాటుకు ఉత్సవ కమిటీ సన్నాహాలు చేస్తోంది. ధన్వంతరి పేరుతో 27 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. భక్తులు నేరుగా పూజలు చేసేందుకు అనుమతి ఉండదని.. కేవలం ఆన్లైన్ పూజలు చేసేందుకే అనుమతి ఇస్తామని ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు.
ఖైరతాబాద్‌లో 66 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. ఇందుకోసం గుజరాత్ నుంచి మట్టిని తెప్పించనున్నామని తెలిపారు. ఏటా విగ్రహ నమూనా ప్రకటించే సిద్ధాంతి విఠల్ శర్మ సూచన మేరకు కరోనా తగ్గాలని 'ధన్వంతరి' పేరును ఖరారు చేసినట్లు వివరించారు. ఈనెల 10వ తేదీ నుంచి పనులు మొదలు పెట్టనున్నట్లు వెల్లడించారు.