తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతిభవన్ కుక్కపిల్ల మృతి... పోలీస్​స్టేషన్​లో కేసు

ప్రగతిభవన్​కు చెందిన హస్కీ అనే 11 నెలల కుక్కపిల్ల వైద్యం వికటించి మృతి చెందింది. యానిమల్​ కేర్​ వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అధికారులు బంజారాహిల్స్​లో పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

వైద్యం వికటించి ప్రగతిభవన్​కు చెందిన కుక్కపిల్ల మృతి

By

Published : Sep 14, 2019, 9:27 AM IST

ప్రగతిభవన్​కు చెందిన హస్కీ అనే 11 నెలల కుక్కపిల్ల వైద్యం వికటించి మృతి చెందింది. అనారోగ్యంతో ఉండటం వల్ల బంజారాహిల్స్​ రోడ్​ నంబర్​ - 4 లోని యానిమల్​ కేర్​ సెంటర్​కు ప్రగతి భవన్​ అధికారులు తీసుకెళ్లారు. డాక్టర్​ నిర్లక్ష్యం వల్లే కుక్కపిల్ల మృతి చెందిందని వైద్యుడు, కేర్​ సెంటర్​ నిర్వాహకురాలిపై అధికారులు బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details