తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - today horoscopes news

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు

By

Published : May 9, 2021, 5:17 AM IST

Updated : May 10, 2021, 1:05 AM IST

మేషరాశి:

శుభయోగాలున్నాయి. ధైర్యంగా ముందడుగు వేయండి. అదృష్టఫలాలు అందుతాయి. వ్యాపారబలం పెరుగుతుంది. గృహసౌఖ్యం ఉంటుంది. మంచి కాలం నడుస్తోంది. భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తిచేస్తారు. శత్రుపీడ ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మంచిది.

వృషభరాశి:

మనోబలంతో విజయం వరిస్తుంది. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో ఇబ్బంది సూచితం. పట్టుదలతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. తోటివారి వల్ల మేలు జరుగుతుంది. స్వయంకృషి ఫలిస్తుంది. అపార్థాలకు తావివ్వకూడదు. కుటుంబపరంగా బాగుంటుంది. గురుశ్లోకం మనశ్శాంతినిస్తుంది.

మిథునరాశి:

మంచి ఫలితముంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. పెద్దల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. ఒక పనిలో విజయం సాధిస్తారు. మొహమాటం పనికిరాదు. ఆత్మీయుల సూచనలు పని చేస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిస్మరణతో శాంతి దొరుకుతుంది.

కర్కాటక రాశి:

ఉద్యోగఫలితం శుభప్రదం. వ్యాపారం అనుకూలిస్తుంది. మంచి లాభాలుంటాయి. అధికారయోగముంది. ప్రశంసలున్నాయి. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. దగ్గరివారి వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. దుర్గాధ్యానం శుభాన్నిస్తుంది.

సింహరాశి:

లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేయండి. ఆనందదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. శాంతియుత జీవితం లభిస్తుంది. ముఖ్యవిషయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఇష్టదేవతను స్మరిస్తే మేలు.

కన్యారాశి:

ధనలాభం సూచితం, శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త వహించాలి. అవసరాలకు తగినంత సహకారం అందుతుంది. నిర్మలమైన మనసుతో ఆలోచించండి. ఉత్తమ భవిష్యత్తు గోచరిస్తుంది. అవరోధాలను తేలికగా అధిగమిస్తారు. దగ్గరివారిని సంప్రదిస్తే మనసు తేలికవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇష్టదైవ స్మరణ శుభప్రదం.

తులారాశి:

ఒక పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం సూచితం. రుణ సమస్యలు రానివ్వద్దు. చిన్న పొరపాటు జరిగినా సమస్య వెంటాడుతుంది. చెడు ఆలోచన మంచిది కాదు. ప్రయాణాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఆదిత్యహృదయం చదవాలి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది.

వృశ్చికరాశి:

ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. అధికారుల నుండి కొంత ఇబ్బంది ఎదురైనా అంతిమంగా విజయముంటుంది. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులపైన ఆధారపడవద్దు. అభీష్టసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. వ్యయభారం లేకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవిని స్మరించండి. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది.

ధనుస్సురాశి:

ముఖ్యకార్యాల్లో విజయం వరిస్తుంది. వ్యాపారలాభాలుంటాయి. సున్నితమైన అంశాల్లో తొందరపాటు నిర్ణయం వద్దు. దగ్గరివారిని సంప్రదించండి. బుద్ధిబలంతో లక్ష్యాన్ని చేరాలి. ఆపదల నుండి బయటపడతారు. అనేక మార్గాల్లో మంచి జరుగుతుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సూర్యధ్యానం మంచి చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

మకరరాశి:

ఉత్తమకాలం నడుస్తోంది. విజయం త్వరగా లభిస్తుంది. ఉద్యోగంలో శ్రేష్ఠమైన ఫలితముంటుంది. వ్యాపారపరంగా మేలు జరగాలంటే ముందస్తు ప్రణాళికలు తప్పనిసరి. సొంత నిర్ణయం ఉత్తమం. ఆర్థికంగా బాగుంటుంది. ఎదురుచూస్తున్న విజయం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇష్టదైవస్మరణ మంచిది.

కుంభరాశి:

ఉద్యోగంలో ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. అద్భుతమైన వ్యాపారలాభం కనపడుతోంది. ఆనందించే అంశాలున్నాయి. జీవితంలో ముఖ్యమైన పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది. ఏకాగ్రతతో పని చేయండి. వాహనలాభం ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయం
శక్తినిస్తుంది. ఆంజనేయస్వామిని స్మరించండి. శాంతి చేకూరుతుంది.

మీనరాశి:

మనోబలంతో పని చేస్తే సత్ఫలితం ఉంటుంది. శ్రమ కూడా పెరుగుతుంది. చంచలత్వం లేకుండా సంభాషించాలి. గొప్ప మేలు ఒకటి చేకూరుతుంది. గృహ- భూ-వాహనాది యోగాలున్నాయి. అందరినీ నమ్మవద్దు. మొహమాటం లేకుండా ధర్మాన్ని అనుసరించండి. వారాంతంలో ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇష్టదైవ స్మరణ శ్రేయస్కరం.

ఇదీ చదవండి:'మొదటి డోసు ధ్రువీకరణ పత్రం తప్పకుండా తీసుకురావాలి'

Last Updated : May 10, 2021, 1:05 AM IST

ABOUT THE AUTHOR

...view details