తెలంగాణ

telangana

ETV Bharat / state

9PM TOPNEWS: టాప్​న్యూస్@9PM - 9pm topnews

ఈరోజు ప్రధాన వార్తలు

9pm topnews
9pm topnews

By

Published : Apr 10, 2022, 8:59 PM IST

  • "రైతుదీక్ష"కు సర్వం సిద్ధం..

పంటల కొనుగోలులో జాతీయ విధానం ఉండాలనే డిమాండ్‌తో.. దిల్లీలోఆందోళనకు తెరాస సిద్ధమైంది. 'రైతు దీక్ష' పేరుతో రేపు.. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు.. హస్తినలో నిరసన తెలపనున్నారు. యాసంగి ధాన్యం కొనే వరకూ వెనక్కి తగ్గేదేలేదని నేతలు తేల్చిచెబుతున్నారు.

  • 25 మందితో ఏపీ కొత్త కేబినెట్..

ఏపీ నూతన మంత్రివర్గం రేపు ఉదయం కొలువుదీరనుంది. గత మూడురోజులుగా దీనిపై కసరత్తు చేస్తోన్న సీఎం జగన్‌.. ఇవాళ తుదిజాబితాను ఖరారు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు మంత్రులుగా ఎంపిక చేసిన వారికి సీఎం కార్యాలయ అధికారులు ఫోన్‌ చేసి సమాచారాన్ని తెలపనున్నారు.

  • ముల్లోకాలు మురిసేలా రాములోరి కల్యాణం...

స్వర్గం దిగొచ్చింది. భూలోకం వైకుంఠమైంది. వేద మంత్రోచ్ఛారణలు మిన్నంటగా.. సమస్త మంగళ వాద్యాల మధ్య, ముల్లోకాలు మురిసే విధంగా మూడుముళ్ల బంధంతో శ్రీరాముడు సీతమ్మ తల్లి ఒక్కటైన మధురక్షణాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది.

  • నీటికాటుకు పెరుగుతున్న బాధితులు..

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని వడ్డెరబస్తీలో కలుషిత నీటి బాధితుల సంఖ్య 100కు చేరువైంది. శనివారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో మరో 15 మంది కొండాపూర్‌ ఆసుపత్రిలో చేరారు.

  • 'వ్యాక్సిన్ 3.0' షురూ..

దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోసు అందించే కార్యక్రమాన్ని కేంద్రం ఆదివారం ప్రారంభించింది. ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వయోజనులు అందరికీ కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులో వచ్చాయి.

  • ఆన్​లైన్​ క్లాసులు చెప్పేందుకు నో!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి స్వదేశానికి తిరిగివచ్చిన భారత విద్యార్థులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. భారత వైఖరి పట్ల అసహనంతో ఉన్న ఉక్రెయిన్​ ప్రొఫెసర్లు తమకు ఆన్​లైన్​లో తరగతులు చెప్పడానికి నిరాకరిస్తున్నారని ఉత్తరాఖండ్ వైద్య విద్యార్థులు ఆరోపించారు.

  • 'ఇకపై అన్నీ మంచి రోజులే'..

ఇక నుంచి అన్నీ మంచి రోజులే రానున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. తుమకూరు జిల్లాలో బిదనగెరె బసవేశ్వర మఠం ప్రతిష్టించిన 161 అడుగుల ఎత్తైన పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

  • స్థిరంగా పసిడి ధర... ఈరోజు ఎంతంటే?

దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • పాక్​ ప్రధాని అభ్యర్థిగా షరీఫ్​ నామినేషన్​..

పాకిస్థాన్​ నూతన ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్‌ షరీఫ్‌ నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష పార్టీ సభ్యుల మద్దతుతో పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

  • కేజీఎఫ్-ఆర్సీబీ దోస్తీ..

దేశంలో క్రికెట్​, సినిమాకు ఉన్నంత క్రేజ్​ మరే రంగానికి లేదనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ రెండూ కలిస్తే.. వినోదం రెట్టింపులో స్థాయిలో ఉండటం గ్యారంటీ. ఈ సరికొత్త పంథాకే శ్రీకారం చుట్టాయి 'కేజీఎఫ్' నిర్మాణ సంస్థ హోంబాళి, ఐపీఎల్​లోని రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు.

ABOUT THE AUTHOR

...view details