తెలంగాణ

telangana

ETV Bharat / state

9PM TOP NEWS - ఇవాళ్టి ప్రధానవార్తలు

ఇవాళ్టి ప్రధానవార్తలు

9PM TOP NEWS
9PM TOP NEWS

By

Published : Mar 24, 2022, 8:58 PM IST

  • పీయూష్‌ గోయల్‌, ప్రశాంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం

ధాన్యం కొనుగోళ్ల అంశంపై జరిగిన భేటీలో పీయూష్ గోయల్, మంత్రి ప్రశాంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కేంద్రం ధాన్యం సేకరణ చేయదని మంత్రులకు గోయల్‌ తేల్చి చెప్పారు. ఇప్పుడున్న విధానాన్ని ప్రజల కోసం మార్చాలని ప్రశాంత్ రెడ్డి కోరగా... మీరు దిల్లీలో ఎలాగో సత్తాలోకి వస్తారు కదా... అప్పుడు మార్చండంటూ పీయూష్‌ స్పందించారు.

  • టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఆ రోజే పరీక్ష

ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 26 నుంచి ఏప్రిల్‌ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.

  • గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుపై హోరెత్తిన ఆందోళనలు

చమురు, గ్యాస్‌ ధరల పెంపు నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఆధ్వర్యంలో ఆందోళనలు హోరెత్తాయి. రహదారులపై వంటవార్పు చేసి నిరసనలు తెలిపారు. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని నినదించారు.

  • బిహార్‌కు వలస కార్మికుల మృతదేహాల తరలింపు

Boyaguda Incident: సికింద్రాబాద్‌ బోయిగూడ అగ్నిప్రమాద ఘటనలో సజీవ దహనమైన 11 మంది బిహార్‌ వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించారు. మృతదేహాలకు నిన్ననే గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అక్కడి మార్చురీలో భద్రపరిచారు.

  • కరోనా పరిహారం లెక్కల్లో గోల్​మాల్​..

కరోనా పరిహారం చెల్లింపులో అవకతవకలపై దర్యాప్తు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు అంగీకరించింది.

భార్యపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహం అంటే భార్యపై లైంగిక వేధింపుల క్రూరమైన చర్యకు భర్త లైసెన్స్ పొందడం కాదని పేర్కొంది. ఇలాంటి చర్య అత్యాచారం కిందికే వస్తుందని స్పష్టం చేసింది.

  • యూపీ సీఎంగా యోగి పట్టాభిషేకం..

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్​ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 50 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • భారీగా పెరిగిన పసిడి ధర..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర పెరిగింది. వివిధ నగరాల్లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధరలు ఎలా ఉన్నాయంటే..

  • సీఎస్కే కెప్టెన్​గా తప్పుకున్న ధోనీ..

అంతా అనుకున్నట్టే జరిగింది. ఈ ఏడాది చెన్నై సూపర్​ కింగ్స్​ సారథిగా ధోనీ కొనసాగుతాడా? లేదా? అని కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. మరో రెండు రోజుల్లో ఐపీఎల్​ 15వ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

  • 'ఆర్​ఆర్​ఆర్'.. ఈ నాలుగు పాత్రలు చాలా కీలకం​!

పాన్‌ ఇండియా స్థాయిలో రేపు విడుదలవుతోన్న 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగమయ్యారు. ట్రైలర్​లో వారు చెప్పే సంభాషణలు, పలికించిన హావాభావాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన వారి గురించి తెలుసుకుందాం..

ABOUT THE AUTHOR

...view details