ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 31,325 నమూనాలను పరీక్షించగా 997 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,99,812కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా చిత్తూరులో 181, అత్యల్పంగా విజయనగరంలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనా చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు.
అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొకరు చొప్పున మరణించారు. ఏపీలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,210కి చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి 282 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,104 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,50,21,363 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.