ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగాలంటూ అత్యధికులు కోరుకుంటున్నారు. ఆన్‌లైన్ సర్వేకు ఇప్పటివరకు స్పందించిన వారిలో... దాదాపు 95 శాతం మంది అమరావతికే జై కొట్టారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలా? లేదా? అన్న అంశంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. '‘ఆంధ్రప్రదేశ్ విత్ అమరావతి'’ పేరుతో నిర్వహిస్తున్న ఈ అభిప్రాయ సేకరణలో... ఇప్పటి వరకూ దాదాపు నాలుగున్నర లక్షల మంది పాల్గొన్నారు. వారిలో దాదాపు 94.98 శాతం మంది రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని స్పష్టం చేశారు.
అమరావతికే 95శాతం ఓట్లు
తెదేపా నిర్వహించిన '‘ఆంధ్రప్రదేశ్ విత్ అమరావతి'’ అనే సర్వేలో అమరావతే రాజధానిగా ఉండాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. దాదాపు 95 శాతం మంది అమరావతే కొనసాగాలని ఓటేశారు. ఇప్పటి వరకూ దాదాపు నాలుగున్నర లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
apwithamaravati.com వెబ్‌సైట్‌లో ‘అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు, అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారా?’ అన్న ఒక్క ప్రశ్న ఉంచారు. దాని కింద అవును/కాదు అన్న ఆప్షన్లు ఇచ్చారు. ఒకరు ఒకసారి మాత్రమే ఓటేసేలా ఈ వెబ్‌సైట్ రూపొందించారు. రాజధాని ఎక్కడుండాలనే అంశంపై శివరామకృష్ణ కమిటీ వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 5వేల మంది ప్రజాభిప్రాయం సేకరించగా దానిలో అధిక శాతం కృష్ణ, గుంటూరు మధ్య ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజా ఆన్‌లైన్ సర్వేలో నాలుగున్నర లక్షల మంది పాల్గొని 95 శాతం మంది వరకూ అమరావతే తమ అభిలాష అని తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి:లక్ష్యం ప్రకారం సర్వేను పూర్తి చేయాలి: జీహెచ్ఎంసీ కమిషనర్