దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ముందుకెళుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. కుల గణన చేయాలని జాతీయ బీసీ కమిషన్ కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే కుల గణన తప్పనిసరిగా చేయాలని కోరారు. కుల గణన కోసం సుప్రీం కోర్టులో మళ్లీ కేసు వేస్తామని తెలిపారు. కుల గణన చేసేంతవరకు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి వెళ్లి భాజపాకు వ్యతిరేకంగా పని చేస్తామని తెలిపారు. ఓబీసీ జాతీయ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన 94వ సమ్మేళనంలో ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్. కృష్ణయ్యతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పలువురు ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు.
బీసీలు చేపట్టే ప్రతి పోరాటాల్లో మేముంటాం...