ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రత్యక్ష బోధనకు తొలి రోజు విద్యార్థుల నుంచి సరైన స్పందన కనిపించలేదు. కేవలం 9 శాతం విద్యార్థులే బడులకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,030 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 13,11,772 మంది విద్యార్థులు ఉండగా.. ఇవాళ కేవలం 1,17,304 విద్యార్థులు హాజరయ్యారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు తెరిచారు. ప్రైవేట్ పాఠశాలలు దాదాపు 70 నుంచి 80 శాతం ప్రారంభించినట్లు విద్యాశాఖ తెలిపింది. క్రమక్రమంగా విద్యార్థుల హాజరు పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారమే ప్రకటించటం వల్ల తల్లిదండ్రుల అనుమతి పత్రాలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.